40.2 C
Hyderabad
April 29, 2024 16: 23 PM
Slider ప్రత్యేకం

రాష్ట్ర రాజకీయాలలో ఉద్యమ నేత జూపల్లి కీలకం కాబోతున్నారా?

#ministerjupally

ఫలించని కేటీఆర్  బుజ్జగింపులు: ఆత్మగౌరవం కోసం జూపల్లి.. సొంత గూటికి?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక పాత్ర వహించబోతున్నట్లు   తెలుస్తుంది. జూపల్లి ప్రత్యేక తెలంగాణ ఆత్మగౌరవంకై, విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ నినాదాని వినిపించారు.నేతలలో కదలికలు తెచ్చారు. అంతేకాదు మంత్రి పదవికి జూపల్లి రాజీనామా చేయడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు ఇతర పార్టీలను నేతలపై ప్రజలు ఒత్తిడి తెచ్చారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రా సాధనలో జూపల్లి  కీలక పాత్ర పోషించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ కూడా అనాడు చేకూర్చారు. ఇప్పుడు కూడా జూపల్లి ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమంలో  కీలక పాత్ర వహించబోతున్నారని తెలుస్తుంది.

ఆత్మగౌరవానికై మాజీ మంత్రి జూపల్లి

ఆనాడు ఆంద్రోల మోచేతి నీళ్లు తాగిన తెలంగాణ ద్రోహులే  నేడు తెలంగాణ ఉద్యమకారులపై  అక్రమ కేసులతో దాడులకు పాల్పడుతున్నారని జూపల్లి ఇది వరకు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

కానీ నేడు సాధించుకున్న రాష్ట్రంలో రైతులు సాగునీరు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగునీరు అందించండని అడిగిన  రైతులపైన, వారి పక్షాన నిలబడిన తెలంగాణ ఉద్యమ కారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఈ రాష్ట్రంలో  చూడాల్సి వస్తుందేమో అని జూపల్లి అనుకోన్నట్టు ఉన్నారు.

అందుకే జూపల్లి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. జూపల్లి నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నారు.జూపల్లి  కొల్లాపూర్ నియోజక వర్గ ప్రాంతానికి మాత్రమే నాయకడు కాదని,జూపల్లి రాష్ట్ర నాయకుడని కూడా అంటున్నారు. ఆయన  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య సీనియర్ నేతలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

టీపీసీసీ పెద్దలతో మాజీ మంత్రి జూపల్లి?

తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను, ప్రజల ఉద్యమాలకు చెల్లించి పోయిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని  ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రస్తుత టిపీసీసీ  పెద్దలు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం  ఉద్యమాలు చేసిన ప్రజా బలం కలిగిన నేతలపై టీపీసీసీ   దృష్టి సాధించినట్లు  తెలుస్తోంది. మాజీ మంత్రి జూపల్లితో చర్చించినట్లు సమాచారం. కొల్లాపూర్ నియోజకవర్గ సర్వేలలో జూపల్లి పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

అందుకే  జూపల్లి ఇంటికి  కేటీఆర్ వెళ్లారు.ఇదివరకు ప్రగతి భవన్ లో బుజ్జగింపులు చేసినట్లు,హామీ ఇచ్చినట్లు కనిపిస్తుంది. జూపల్లి ఆత్మగౌరవం విషయంలో ఒక స్టాండ్ మీద ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయ మార్పులలో జూపల్లి కీలకపాత్ర వహించబోతున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చ చేసుకుంటున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

క్ష‌య‌ ర‌హిత స‌మాజ నిర్మాణానికి కృషి

Satyam NEWS

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

శరవేగంగా అనంతపురం టవర్‌క్లాక్‌ ఆర్‌ఓబీ నిర్మాణం

Bhavani

Leave a Comment