28.7 C
Hyderabad
April 26, 2024 09: 24 AM
Slider కడప

శాడ్ స్టోరీ: కువైట్ లో కడపజిల్లా వాసి మృతి

kuwite

కడపజిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లి కి చెందిన దేరంగుల కృష్టమరాజు(26) గత ఒకటిన్నర సంవత్సరం క్రిందట బ్రతుకు తెరువు కు కువైట్ దేశం వచ్చి ఆ దేశంలోని సులేబియా ప్రాంతంలో ఓ ఇంటిలో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే గత నాలుగు రోజుల క్రింద చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొగ్గు లు వేడి పెట్టుకుని రూమ్ మొత్తం బంద్ చేసుకొని పడుకున్నాడు.

దాంతో ఊపిరి ఆడక మరణించి ఉంటాడని భావిస్తున్నారు. అక్కడి పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని వారి బంధుమిత్రులు గల్ఫ్ కాపు సంఘం అధ్యక్షుడు జిలకర మురళి రాయల్ దృష్టికి తీసుకురావడంతో వారికి, భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు అన్ని విధాలుగా సహకరించారు. నేడు ఇండియాకు పంపుతూ, అదే విధంగా మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుండి APNRT సేవా సంస్థ వారి ద్వారా కువైట్ కన్వీనర్ మమ్మిడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఉచ్ఛిత అంబులెన్స్ ఏర్పాటు చేయించారు గల్ఫ్ కాపు సేవా సంగం అధ్యక్షుడు జిలకర మురళి రాయల్. ఈ కార్యక్రమంలో తన వెంట ఉండి అన్ని విధాలుగా సహకరించిన సమీప గ్రామస్తులు బత్తల రంగయ్య కు, మృతుని చెందిన కృష్టమరాజు కువైటీ టిక్కెట్ కు, బాక్స్ కు అయ్యే ఖర్చు అందించిన కువైట్ కి మురళి రాయల్ ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

వ్యక్తుల కంటే పార్టీకే ప్రాముఖ్యత

Sub Editor 2

గుజరాత్ పై గురి: ముడు పార్టీలు నువ్వా నేనా

Bhavani

Leave a Comment