30.7 C
Hyderabad
April 29, 2024 05: 46 AM
Slider ప్రత్యేకం

సీఎం కేసీఆర్ పై కాయితీల పోటీ

#lambada

లిస్టు విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్

లబానా కాయితి లంబాడీలు అనుకున్నదే చేశారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నుంచి కేసీఆర్ పై పోటీ చేస్తామని ప్రకటించడమే కాకుండా పోటీ చేసే అభ్యర్థుల లిస్టు సైతం రిలీజ్ చేసి షాకిచ్చారు. ఈ పరిణామం బీఆర్ఎస్ కు మింగుడు పడుతుందో లేదో చూడాలి. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో లబానా కాయితి లంబాడాల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై పోటీ చేయబోయే 1016 మంది అభ్యర్థుల లిస్ట్ మీడియాకు చూపించారు. తాన్ సింగ్ మాట్లాడుతూ.. మంగళవారంతో సీఎం కేసీఆర్ కు ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ కు వేడుకున్నామని, సవాల్ కూడా చేశామని అయినా స్పందన లేకుండా పోయిందన్నారు. సీఎం గారూ.. మీకు శతకోటి దండాలు.. మేము మీ పార్టీకి చెందిన వాళ్ళమే. అయినా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల కంటే హీనంగా చిత్రహింసలకు గురిచేసారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం లోగా 245 జిఓ విడుదల చేయాలన్నారు. అందులో లబానా లంబాడీల అంశం ఉంటేనే అమలు చేయాలన్నారు.

చెల్లప్ప కమిషన్ ను కాపాడాలన్నారు. తాము 50 సంవత్సరాలుగా పొడు భూములు సాగు చేసుకుంటున్నామని, పక్కవారికి పట్టాలిచ్చి తమకు ఇవ్వకుండా పొట్లాట పెట్టారన్నారు. లబాణా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తండాల అభివృద్ధి జరుగుతుందంటే సరే అన్నారని తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినా అందులో తమను చేర్చలేదన్నారు. 1977 నాటి 245 జిఓ మాత్రమే తాము అమలు చేయాలని కోరుతున్నామని, కొత్త జిఓ అడగడం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ గారూ.. కాలాన్ని వృధా చేయకండి.. మమ్మల్ని రోడ్లపైకి రానివ్వకండి అని వేడుకున్నారు. 9 సంవత్సరాల్లో 99 సార్లు సీఎంను కలవడానికి ప్రయత్నించామని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలను సీఎంను కలిపించాలని వేడుకున్నా స్పందన లేదని, చివరికి ఇంటలిజెన్స్ వాళ్ళు కల్పిస్తామని చెప్పి అరెస్ట్ చేసారని వాపోయారు. ఇక ఓపిక నశించిందని, చెప్పినట్టుగానే సీఎంపై పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. ఇక 6,7,8 తేదీలలో ఎపుడైనా సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భజన్ లాల్, నర్సింగ్, రతీరాం, జగదీష్, అమర్ సింగ్, బంతిలాల్, రవీందర్, పెంటయ్య, గోపాల్, సురేష్, సుభాష్, ఇంద్రజిత్, భీషన్ పాల్గొన్నారు.

సీఎం కేసిఆర్ పై పోటీ చేస్తున్న 1016 మంది అభ్యర్థుల వివరాలు మండలాల వారిగా ఎంత మంది అనే వివరాలు వెల్లడించారు.

గాంధారి-328

లింగంపేట-188

పెద్ద కొడప్ గల్-200

వర్ని-100

కంగ్టి-50

ఆదిలాబాద్-150 మంది పోటీ చేస్తున్నారు.

Related posts

ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Bhavani

విశాఖలో మరో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్

Satyam NEWS

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి పెరిగిన మరింత క్రేజ్‌

Sub Editor

Leave a Comment