38.2 C
Hyderabad
April 28, 2024 20: 47 PM
Slider ప్రత్యేకం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి

#kalvakurthy

అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. బైకులు, మొబైల్ ఫోన్లు చోరికి గురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గత ఆదివారం ఓ వ్యక్తి కూరగాయల కొనుగోలు వెళ్లగా చరవాణిని గుర్తుతెలియని దుండగులు దొంగిలించినట్లు కొద్ది సేపటికి తేరుకున్న వ్యక్తి కూరగాయల మార్కెట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు వారిని సంప్రదించగా మా చరవాణి లే పోతే దిక్కులేదని అడిగే నాథుడు లేడని మేము ఎవరికి చెప్పుకోవాలి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

పార్థసారథి సినిమా హాల్ వెనుక భాగంలో రాత్రి 11:00 గంటల సమయంలో ఉన్న ద్విచక్ర మోటార్ వాహనం ఉదయం చూసే సరికి లేకపోవడంతో కంగుతిన్న కుటుంబీకులు ఎక్కడా కనిపించకపోవడంతో చోరికి గురి అయినట్లు భావించి లబో దిబో మన్నారు. హైదరాబాద్ చౌరస్తాలోని చిల్డ్రన్స్ స్వీట్స్ లో గుమాస్తాగా పని చేస్తున్నా ఓ అబ్బాయి మొబైల్ ఫోన్ సోమవారం చోరీకి గురైంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు చోరీలతో కల్వకుర్తిలో జనాలు చచ్చి పోతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలో గుట్కాలు అక్రమ ఇసుక రవాణా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గంజాయి ఇలా అనేక అసాంఘిక కార్యకలాపాలకు కల్వకుర్తి అడ్డాగా మారిపోయిందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఉన్నత అధికారుల ఒత్తిడితో ఒక రోజు ఒకే ఒక్కడు చిత్రంలో  ముఖ్యమంత్రి పనిచేసిన మాదిరిగా, అమాయకపు చిరు దుకాణాలలో  అడపాదడపా తనిఖీలు చేసి నాలుగైదు వేలు విలువ చేసే గుట్కాలను మాత్రమే పట్టుకొని ఇంకొన్ని దుకాణాలలో నిషేధించని వస్తువులను సైతం తీసుకెళ్లి వ్యాపారులను  విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేస్తున్నారని, పెద్ద ఎత్తున గుట్కాలు విక్రయించేవారిని వదిలేస్తున్నారని  పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా రేషన్ బియ్యం  మధ్య దళారుల పాలు కాకుండా రీసైకిలింగ్ చేయకుండా గట్టి పహారాతో అధికారుల పర్యవేక్షణ ఉన్న  ఆలియా కొండమల్లేపల్లి దేవరకొండ,తూర్పు పల్లి , మొదలగు గిరిజనులు ఉండే గ్రామాలను పట్టణాలను ఎంచుకొని వారికి 10 రూపాయలు కిలోకి ఇచ్చి నల్లగొండ జిల్లా నుంచి బ్రోకర్ల ద్వారా కల్వకుర్తి రైస్ మిల్ లకు చేరుతున్నాయి.

గత నెలలో రెండు లారీలు చారగొండ లో కల్వకుర్తికి వస్తుండగా పట్టుబడిన  రేషన్ బియ్యం కల్వకుర్తి మిల్లర్లకు రావట్లేదని ఆ వ్యక్తి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తప్పుడు సమాచారం అధికారులకు ఇచ్చి మిల్లర్లు బయటపడ్డారు.కాగా మరో మాఫియా ఇసుక మాఫియా, మన ఇసుక వాహనం ప్రారంభమైనను అక్రమ ఇసుక రవాణా ఏ అడ్డూ అదుపు లేకుండా జోరుగానే కొనసాగుతుంది.

ఉదయం 5 గంటల సమయంలో  జె పి నగర్ నుండి విచ్చలవిడిగా ట్రాక్టరలలో పదుల సంఖ్యలో అక్రమ ఇసుక రవాణా సాగిన ను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతేఅడ్డు అదుపు లేకుండా అన్నీ అక్రమ దందాలకు,అసాంఘిక కార్యకలాపాలకు కల్వకుర్తి పట్టణం  అడ్డాగా మారిపోయింది.

అదుపు తప్పుతున్న లా అండ్ ఆర్డర్

కల్వకుర్తి పట్టణంలో పోలీసుల పనితీరు తో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని పట్టణ వాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వరుస దొంగతనాలు, ఇసుక మాఫియా రేషన్ మాఫియా గంజాయి మాఫియా రెచ్చిపోవడంతో పట్టణ వాసుల చర్చలు నిజాన్ని తలపిస్తున్నాయి. పోలీసుల పనితీరు వ్యవహారశైలిపై ప్రజలు ఏమీ చేయలేక తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.

ఎవరైనా వారికి జరిగిన అన్యాయాన్ని స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన చేతులు తడపాల్సిందేనని, కనీసం ఇచ్చిన ఫిర్యాదుకు రసీదు కూడా ఇవ్వడం లేదని, కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఎవరితో అయినా రాజకీయ పలుకుబడితో  ఉన్న వారితో  స్టేషన్ కు  వెళ్లిఫిర్యాదు గురించి అడుగగా అన్యాయం జరిగిన వ్యక్తుల పైన తప్పుడు కేసులు చేస్తున్నారని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని, జిల్లా స్థాయి అధికారులు టి ఎస్ పీ కే ,డి ఎస్ పి . ,సి ఐ కి సర్కిల్ ఇన్స్పెక్టర్  స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు  తిరిగి మళ్లీ అక్కడికే తమ ఫిర్యాదు రావడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆగ్రహాన్ని, అవమానాలకు గురవుతున్నట్లు పట్టణ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏదైనా చోరీకి గురైన అభాగ్యుడి ఫిర్యాదుకు సాక్షిగా ఐ విట్నెస్ ఉన్న వ్యక్తి గట్టిగా చెప్పడం లేదని అతని సాక్ష్యం చెల్లదని ఎఫ్ ఐ ఆర్ చేయనని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కరాఖండిగా చెప్పడమే కాక బాధితుడు పై తప్పుడు ఫిర్యాదు సేకరించి ఫైల్ చేసిన దాఖలాలు చాలా వరకు ఉన్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు.

అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ వారి వెంటే సమయం మొత్తం వృధా చేస్తున్నారని ప్రజల సమస్యలపై పట్టించుకోవడంలేదని, నెలల తరబడి  డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేయడం లేదని, లా అండ్ ఆర్డర్ కుంటుపడుతుందని పట్టణవాసులు బహిరంగానే చర్చించుకుంటున్నారు

అదేవిధంగా ఈ మాఫియాలు చేసే అక్రమ దందాల ఫోటోలు వీడియోలు వార్తా సేకరణలో భాగంగా తీసుకునే జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు, డబ్బులు డిమాండ్ చేశారని, జర్నలిజంపై దాడులు చేసేవారికి అధికారులు సహకరిస్తూ వారి పక్షాన నిలబడుతూన్నారనేది జగమెరిగిన సత్యం.

తప్పు చేసే వారి కంటే తప్పు చేయించే వారికే పెద్దశిక్ష అని మన రాజ్యాంగం చెప్పుతుంది. అధికారులు తప్పు చేసిన వారిని వదిలేసి వారికి కొమ్ము కాస్తూ  తప్పుడు కేసులు నమోదు చేసి అమాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్ ను పట్టించుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి లా అండ్ ఆర్డర్ క్రమబద్ధీకరణ చేయాల్సిందిగా పట్టణ వాసులు కోరుతున్నారు.

Related posts

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS

ఎనాలసిస్: పైపైకి ఎగబాకుతున్న కరోనా కేసులు

Satyam NEWS

భ్రూణ హత్యలు నేరం

Murali Krishna

Leave a Comment