30.7 C
Hyderabad
April 29, 2024 04: 22 AM
Slider మహబూబ్ నగర్

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం

#kantivelugu

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లాలో చేపట్టిన “కంటి వెలుగు” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్.డి.ఓ. కార్యాలయంలో (విలేకరులకు) పాత్రికేయులకు ఏర్పాటు చేసిన “ప్రత్యేక కంటి వెలుగు” కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సి.ఎస్. ఆదేశాల మేరకు ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 19వ. తేది నుండి జూన్ 14వ. తేది వరకు 100 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కంటి పరీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 20 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించటం జరిగిందని, 3 వేల 100 అద్దాలను అందించటం జరిగిందని, సుమారు 400 మందికి ప్రిస్క్రిప్షన్ అందించటం జరిగిందని ఆమె వివరించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమం చాలా చక్కగా కొనసాగుతున్నదని, ఇదే స్పూర్తితో 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆమె ఆదేశించారు.

పాత్రికేయుల ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, ఆర్. డి. ఓ. పద్మావతీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.రవిశంకర్, ఏ.ఓ.సాయినాథ్ రెడ్డి, డి.పి. ఆర్.ఓ.రషీద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

వైసీపీకి దిమ్మతిరిగే నిర్ణయం: పంచకర్ల అవుట్

Satyam NEWS

బద్వేల్ ఉప ఎన్నిక కు భయపడుతున్న వై సీ పి

Satyam NEWS

సర్వభూపాల వాహ‌నంపై శ్రీ‌ మలయప్ప స్వామి

Satyam NEWS

Leave a Comment