తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం భేటి అయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ ను కపిల్ దేవ్ కలిశారు. డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్ కు సహకరించాలని కపిల్ దేవ్ ఈ సందర్భంగా మంత్రిని కోరారు. తప్పకుండా తమ సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ కపిల్ దేవ్ కు హామీనిచ్చారు.
previous post