29.7 C
Hyderabad
April 29, 2024 09: 40 AM
Slider ఆంధ్రప్రదేశ్

అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం

call center

రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు ఏపిలో ప్రత్యేక కాల్ సెంటర్ ను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్ లైన్‌ కాల్‌సెంటర్‌ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన నేరుగా కాల్ సెంటర్ కే ఫోన్ చేశారు. కాల్‌సెంటర్‌ పనితీరు, వివరాలు సీఎం తెలుసుకున్నారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Related posts

కేసీఆర్ మోస‌కారి అంద‌రినీ మ‌భ్య‌పెట్టారు బీజేపీ

Sub Editor

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

Satyam NEWS

కంప్లయింట్: మలాలా చిత్ర దర్శకుడికి ఫత్వా

Satyam NEWS

Leave a Comment