42.2 C
Hyderabad
April 26, 2024 15: 44 PM
Slider గుంటూరు

పౌరుషానికి ప్రతీక కారంపూడి పల్నాటి ఉత్సవాలు

పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అన్నారు. అలనాటి పల్నాటి చరిత్ర లో చేప్పట్టిన కోడిపోరు ఘట్టాన్ని పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారితో కలిసి వీర్ల దేవాలయ ఆవరణలో కోడిపందేలను నిర్వహించారు. మాచర్ల రాజ్యాం తరపున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లు ను ఎమ్మెల్యే పిఆర్కే చేతబూనారు. గురజాల రాజ్యాం తరపున నాయకురాలు నాగమ్మ పందెపు కోడి శివంగి డేగను, మండల వైసీపీ కన్వినర్ కొంగర సుబ్రహ్మణ్యం చేతబట్టుకొని సాంప్రదాయం ప్రకారం కోడిపందెలను నిర్వహించారు. పందెంలో బ్రహ్మనాయుడు కోడి (చిట్టిమల్లు) రెండు సార్లు విజయం సాధిస్తుంది. మూడవ సారి ఎవరు గెలిస్తే వారు రాజ్యాం వదిలి వెళ్లాలని అలనాడు బ్రహ్మనాయుడు ని నాయకురాలు నాగమ్మ రెచ్చగొడుతుంది దింతో మూడవ సారి కోడిపందెలకు పల్నాటి బ్రహ్మనాయుడు సిద్ధం అవుతాడు. ఈ మేరకు నాయకురాలు నాగమ్మ కుట్రలు కుతంత్రాలతో, నాగమ్మ కోడి అయినా శివంగి డేగ విజయాన్ని సాధిస్తుంది దింతో బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లినట్లు చరిత్ర చెపుతుంది. ఈ కోడిపందెలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి కోడిపందేల ఘట్టాన్ని తిలకించేందుకు మాచర్ల మున్సిపల్ చైర్మన్ వైసీపీ తురగ కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, వీరాచారవాంతులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కోడిపందెలను పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యగారు నిర్వహించారు.

ఈ సందర్బంగా మాచర్ల ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ పల్నాటి చరిత్ర చిహ్నాలను కాపాడుకొని పల్నాటి చరిత్రను దేశం నలుమూలలకు విస్తరింపచేసే విధంగా కృషి చేయవలసిన బాధ్యత పల్నాడు ప్రాంత ప్రజలపై ఉందని అయన అన్నారు సుమారు 900 సంవత్సరాలు గా పల్నాటి వీరాచారా ఉత్సవాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని అయన అన్నారు. వీర్ల దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అని అయన తెలిపారు. ఈ సందర్బంగా పల్నాటి కథను వీరాచారవంతులు గాధ రూపంలో తెలియజేసారు. మొదటిగా కారంపూడి చేరుకున్న ఎమ్మెల్యే పిఆర్కే వీర్ల దేవాలయనికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం చెన్నకేశవ దేవాలయం, అంకాలమ్మ దేవాలయలలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ పూర్ణకుంభంతో స్వాగతం పలికింది గురజాల డిఎస్పీ జయరాంప్రసాద్ ఆధ్వర్యంలో కారంపూడి సిఐ దార్ల. జయకుమార్, కారంపూడి ఎస్ఐ ఎం. రామాంజనేయులు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాటి పీఠం నిర్వాహకులు బొగ్గవరపు విజయ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపిడిఓ శ్రీనివాసరెడ్డి, ఎంపిపి మేకల శారదశ్రీనివాసరెడ్డి, గ్రామసర్పంచ్ రామావత్ ప్రమీలభాయి తేజానాయక్, జడ్పీటీసీ షేక్. షఫీ, సీనియర్ వైసీపీ నాయకులు అక్బర్ జానీ భాషా, యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కొమ్ము చంద్రశేఖర్, కోమెర. పిచ్చయ్య, వేముల లింగయ్య, మహిళ కన్వీనర్ మేకపోతు వెంకటరమణ, పాతూరి రామిరెడ్డి, ఆశం.

విజయభాస్కర్ రెడ్డి, మర్రి. శేషయ్య, జొన్నలగడ్డ. శ్రీనివాసరావు, జక్కా నరసింహరావు, పంగులూరి చినవెంకటనరసయ్య, అల్లు. వెంకటేశ్వర రెడ్డి, గుండా శ్రీనివాసరావు, పంచాయతీ ఉపసర్పంచ్ సురే అంకారావు, కారాలపాటి. సుబ్బారావు, కోరే సత్యం, షేక్. బజాజ్ మీరా, పంచాయతీ కార్యదర్శి కాసిన్య నాయక్, తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వీరచారవంతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

మంత్రివర్గంలోకి అనంత, జంగా దాదాపుగా ఖరారు

Satyam NEWS

పెద్దపులి సంచారంతో 3 గ్రామాల్లో అలజడి

Bhavani

తిరుమల శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

Satyam NEWS

Leave a Comment