40.2 C
Hyderabad
April 29, 2024 15: 47 PM
Slider ప్రపంచం

సాడ్ :హైతీ లో అగ్ని ప్రమాదం 15 మంది చిన్నారుల మృతి

karebian country haithy ngo fired 15 died

కరీబియన్‌ దేశం హైతీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఓ ఎన్జీవో సంస్థ నిర్వహిస్తున్న వసతి గృహం క్షణాల్లో మంటల్లో కాలిపోయింది. రాజధాని పోర్ట్‌ అవు ప్రిన్స్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి. ప్రమాదానికి గురైంది అమెరికాకు చెందిన క్రైస్తవ మత ఎన్జీవో ‘బైబిల్‌ అండర్‌స్టాండింగ్‌’ అనాథశరణాలయంగా తెలిసింది.

హైతీలో రెండు అనాథ శరణాలయాను నిర్వహిస్తున్న సదరు ఎన్జీవో 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన హైతీ అధ్యక్షుడు జోవినల్‌ మాయిజ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. వెలుగుతున్న క్యాండిల్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

Related posts

గద్దర్ మృతి చాలా బాధాకరం

Bhavani

కొల్లాపూర్ ఎంపిడిఓ కార్యాలయ పరిధిలోని సెటర్లకు ఓపెన్ టెండర్ నిర్వహించాలి

Satyam NEWS

పర్యావరణ ప్రభావంపై శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment