మనీలాండరింగ్ కేసు పేరుతో కర్నాటక కాంగ్రెస్ పార్టీ వెన్నెముకను బిజెపి విరిచివేసింది. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ అయిన డి కె శివకుమార్ ను ఎన్ ఫోర్సు మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ ను గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని గతంలో శివకుమార్ కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన అభ్యర్ధనను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఈడీ అరెస్టు చేయడానికి మార్గం సుగమం అయింది. కర్నాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన ప్రతి సారీ డి కె శివకుమార్ ట్రబుల్ షూటర్ పాత్ర పోషించేవారు. ఆయన మాటపైనే చాలా వరకు కర్నాటక కాంగ్రెస్ పార్టీ నడిచేది. డి కె శివకుమార్ పై ఇలా కేసులు రావడం, అరెస్టు కావడంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బతగిలినట్లే. ఏడాదిన్నర కిందట శివకుమార్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సందర్భంగా రూ.8.59 కోట్ల ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
previous post
next post