37.2 C
Hyderabad
May 2, 2024 11: 11 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

#SrisailamTemple

జ్యోతిర్లింగ క్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు.

అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు మాత్రమే నిర్వహిస్తారు. ఆర్జిత అభిషేకాలలో మొదటి విడతను ఉదయం. గం. 6.30 లకు:  రెండవ విడతను ఉదయం గం. 8.30లకు: మూడవ విడతను ఉదయం గం.11.30లకు: నాలగవవిడతను సాయంత్రం గం.6. 30లకు జరిపిస్తారు.

అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత హోమాల నిర్వహణ ఉంటుంది. ఈ రోజు  సాయంత్రం ఆలయ ప్రాంగణములో  శాస్త్రోక్తంగా ఆకాశదీపం వెలిగిస్తారు.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు సాయంత్రం “పుష్కరిణి” వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కూడా నిర్వహించనున్నారు.

కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే  పుష్కరిణి హారతికి  భక్తులకు అనుమతిస్తారు. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు యూట్యూబ్  ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

Related posts

తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలి

Satyam NEWS

కన్నీళ్లు పెట్టుకొన్న ప్రధాని మోడీ

Satyam NEWS

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

Satyam NEWS

Leave a Comment