30.7 C
Hyderabad
April 29, 2024 06: 53 AM
Slider సినిమా

ఈ నెల 13న వస్తున్న హీరో నిఖిల్ ‘కార్తికేయ 2’

#kartikeya2

నిఖిల్ హీరోగా ‘కార్తికేయ 2’ సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ‘నా వరకూ వచ్చేవరకే సమస్య .. నా వరకూ వచ్చాక సమాధానం’ అంటూ నిఖిల్ సందడి చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

హీరో దైవ సంబంధమైన కార్యమేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమైంది. అంతకు మించి మిగతా విషయాలేవీ రివీల్ చేయలేదు. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

ఇంతవరకూ ఈ ట్రైలర్ 9 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకుంది. చాలా వేగంగా ఈ ట్రైలర్ ఈ స్థాయి వ్యూస్ ను అందుకోవడం విశేషంగా చెబుతున్నారు. నిఖిల్ జోడీగా అనుపమ అలరించనుంది. అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.

Related posts

రాజధాని ఢిల్లీకి శీతలగాలుల ప్రమాదం

Satyam NEWS

ప్రత్యామ్నాయం చూడకుండా వీఆర్వోల రద్దు అన్యాయం

Satyam NEWS

పార్టీ మారేందుకు జూపల్లి మరో అడుగు ముందుకు?

Bhavani

Leave a Comment