38.2 C
Hyderabad
April 27, 2024 17: 39 PM
Slider కవి ప్రపంచం

వెన్నెల చకోరాలై

#Kondapally Niharini

ఎడారి దాహపు చల్లదనమై

తేనీటి అవసరపు వేడిదనమై

అన్నానికి ముందు ఆకలి రూపై

తిన్నాక తృప్తి భావమై

నిదురకు సరితూగు మధుర గీతమై

 కలల్లో పలకరించిన  పల్లవులై

వాక్యం వెనుదిరగనివ్వని అద్భుతం

వాక్యం ముందుకు నడిపించే ఉజ్వల తేజం

స్వేచ్ఛానుభవసారపు ప్రశ్నల బిందువులు

గుండెగోడకు వేళాడేసినప్పుడల్లా

వాక్యం ఓ గురువు

బ్రతుకుభారపు బాధల దృశ్యాలకు

 అమ్మానాన్నల ఆప్యాయతనే

వాక్యాన్ని అనుదినపు ఆటల సందళ్ల లో చూసినప్పుడల్లా

చిలిపితనపు తోబుట్టువవుతుంది

భవితకోసం భరోసాకోసం

పనిభారపు క్షణమైనపుడు

 వాక్యం కొత్త వెలుగును వెంటేసుకొస్తుంది

మనదైన  సోమరితనపు యుగమైనప్పుడు

వాక్యం గమనానికి గమ్యానికి వారధవుతుంది

భావదారద్ర్యపు వేగానికి కొట్టుమిట్టాడినప్పుడల్లా

హృదయ తంత్రులు మీటే పదనాదమవుతుంది

వాక్యం నిలువెత్తు భుజానికి పాటల సంచీగ ప్రత్యక్ష మైనప్పుడు

మూర్త అమూర్త సయోధ్యల్లో

చరణ చరణాల యోగమవుతుంది

ఈ రోజు పాటకు ప్రాణమైన మాట మూగబోయింది

వాక్యాన్ని జంటచేసుకుని

కవిత్వాన్ని ప్రేమించే వారందరినీ విడిచి పోయింది

చిన్నబోయిన వెండితెర పాటల మూట లేదని

తల్లిదూరమైన పిల్లల్లా

ఇక ఎవరిని నిగ్గదీసి అడగాలో తెలియని వాళ్ళయ్యారు

వెంటాడే వాక్యాలకోసం

సరివెన్నెలు  సిరివెన్నెలలు  లేని చకోరాలయ్యారు

– డా॥ కొండపల్లి నీహారిణి

Related posts

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు: సిపిఐ 

Satyam NEWS

హర హర మహాదేవ అంటూ మార్మోగిన మేళ్ళచెరువు

Satyam NEWS

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

Satyam NEWS

Leave a Comment