Slider కవి ప్రపంచం

అసలు నిజం

#Jwalitha Balajeenagar

కంటికి కనపడని కరోనా

మనిషిని అంతం చేస్తూన్నావా

అంతరించిన మనిషిని పునర్నిర్మిస్తున్నావా

అహంతో విర్రవీగే మనిషికి

పాఠం నేర్పుతున్న గురువువా

శస్త్రచికిత్స జరిగేప్పుడు

నొప్పీ , రోదనా సహజమే

బాధ భరించ లేక వైద్యుడికి నిందా తప్పనిదే

దుఃఖం నిజమే నష్టం నిజమే కష్టం నిజమే

మనిషిని అన్నీ వలిచీ నగ్నంగా నిలబెట్టింది నిజమే

కులం మతం వర్గం ప్రాంతం లేకుండా

మనుషులకు ప్రేమ నేర్పి

అందరినీ దగ్గరికి చేయడం అసలు నిజం

వెద్యం అంటే ధనసేకరణ అనే

నిందలను తుడిచేసి

ప్రాణాలను ఫణంగా పెట్టి

ప్రజలకు సేవలందిస్తూన్న వీరసైనికులుగా మార్చావు

ఐ కాంట్ లవ్ యూ కరోనా

ఫిర్ కభీ నహీ ఆనా

జ్వలిత, బాలాజీనగర్, కుకట్ పల్లి, హైదరాబాద్

Related posts

ఓటరు అవగాహన కథనాలకు అవార్డులు

Satyam NEWS

ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్

Satyam NEWS

లాస్ట్ ఛేంజ్: రాజ్యసభకు కేకే సురేష్ రెడ్డిలకు లైన్ క్లియర్

Satyam NEWS

Leave a Comment