33.7 C
Hyderabad
April 29, 2024 01: 30 AM
Slider నల్గొండ

కెసిఆర్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా ఉపద్రవం

#Hujurnagar Congress

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రలో కరోనా ఉపద్రవం సంభవించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం( ఇందిరా భవన్)లో నిరసన ప్రదర్శన జరిగింది.

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక నాయకులు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రగాని నాగన్న గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలోనే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంతటి ఉపద్రవం జరిగి ఉండేది కాదని వారననారు.

కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?

పారాసెటమాల్ సరిపోతుందని, మాస్కులు అవసరం లేదని, కరోనాని రాష్ట్రంలోకి రానివ్వమని, వచ్చిన నా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అడ్డుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. కోవిడ్ -19 రోగులు వైద్య సిబ్బంది కొరత, వెంటిలేటర్ల కొరత, ఆక్సిజన్ కొరత వల్ల మరణిస్తున్నారని వారన్నారు.

ఊపిరి పీల్చుకో లేకపోవడంతో వెంటిలేటర్ లేక తనువు చాలించిన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో మరణించిన యువకుడి ఇటీవల వీడియో నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని అన్నారు. కరోనా పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తే సూచనలు చేసిన వారిని అపహాస్యం చేసి మాట్లాడిన వ్యక్తి కెసిఆర్ అని వారు ఎద్దేవా చేశారు.

కేసీఆర్ విధానాలను తిప్పికొట్టాలి

ప్రజలంతా చైతన్యమై కేసిఆర్ దుర్మార్గపు విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టెస్ట్ – ట్రేస్ – ట్రీట్మెంట్ (T.T.T) ఈ విధానం అమలు చేయాలని అన్నారు. అసంఘటిత కార్మికుల బ్యాంకు ఖాతాలలో 10 వేల రూపాయల నగదు వేయాలని కూడా డిమాండ్ చేశారు.

పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో కరోనా టెస్టులు ఉచితంగా చేసి,ఆసుపత్రులలో మౌలిక వసతులు‌ కల్పించాలన్నారు.  ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు,సుంకర శివరాం, బాచిమంచి గిరిబాబు, ఎండి పాషా, శ్రవణ్ కుమార్, తేజావత్ రాజా, ముశం సత్యనారాయణ,కోలపూడి యోహాన్, జక్కుల మల్లయ్య, దొంతగాని జగన్, పోతన బోయిన రామ్మూర్తి, పోతుల జ్ఞానయ్య, కోల మట్టయ్య, బ్రహ్మాజీ, యలమంద, వెంకటేశ్వర్లు, పల్లపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మధ్యవర్తి ముందే మంటలు: భగ్గుమంటున్న హిందూపురం వైసీపీ నేతలు

Satyam NEWS

పెంచిన వంట గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలి

Satyam NEWS

అత్యంత కిరాతకంగా 20 మందిని చంపిన చెత్త చైనా గ్యాంగ్

Satyam NEWS

Leave a Comment