29.7 C
Hyderabad
April 29, 2024 10: 46 AM
Slider ఖమ్మం

తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే

#Panchayats

గిరిజన తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దేనని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక మండల పరిధిలోని ఓబులరావు బంజర గ్రామంలో సాంప్రదాయబద్ధంగా గిరిజనుల సమక్షంలో ఘనజం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేను మహిళలు, గ్రామస్తులు, యువత ఎమ్మేల్యే సండ్రకి సాంప్రదాయ వస్త్ర దారణతో, బతుకమ్మలతో, కోలాట నృత్యాలతో, పూల జల్లులతో నినాదాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజన తండాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించామని తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని అన్నారు. బంజారా మహిళలు కాళ్ళకు గజ్జలు కట్టుకొని, ఆటపాటలతో ఊరంతా మామిడి తోరణాలతో కొబ్బరి ఆకులతో అలంకరించగా పండగలా గ్రామంలో ర్యాలీని ఘనంగా నిర్వహించారు. లంబాడీల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ పూజలు నిర్వహించారు.

శతాబ్ద కాలంలో జరగని గిరిజనుల అభివృద్దినీ దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందుకు నిలువెత్తు సాక్ష్యం తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే నని అన్నారు. బంజారా వాసుల సమక్షంలో బంజారా సంస్కృతిని తెలుపుతూ గిరిజన దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపు కోవడం సంతోషదాయకం అన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా అణచివేతకు, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన గిరిజనులు, ఆదివాసీలను ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తండాల్లో నవశకం వచ్చిందని అన్నారు. ఈ రోజు సమాజంలో గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయని ఇంతటి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి యావత్ గిరిజన సమాజం బాసటగా నిలవాలని కాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ, తహసిల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో బి. రవికుమార్, వ్యవసాయ అధికారి రూపా, ఆయా శాఖల అధికారులు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పిటిసి కట్టా అజయ్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు పసుమర్తి చంద్రరావు, సర్పంచ్ భూక్యా మాన్సింగ్, ముచ్చారం, వైన్ పురం సర్పంచులు గంగవరపు శ్రీనివాసరావు,

రావి సూర్యనారాయణ, బీఅర్ఎస్ మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, నాయకులు మేకల కృష్ణ, ఎంపిటిసి వైకంటి పద్మావతి హరిబాబు, బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు యరమల సత్యనారాయణ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, వైస్ సర్పంచులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శికి విశేషంగా ఏర్పాట్లు

Satyam NEWS

లెక్చరర్లకు, టీచర్లకు గౌరవ వేతనం కోసం ఎంఐఎం దీక్ష

Satyam NEWS

కన్నుల పండువగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

Satyam NEWS

Leave a Comment