29.7 C
Hyderabad
April 29, 2024 07: 35 AM
Slider ముఖ్యంశాలు

రెండో సారి గెలిచిన కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి

#Etela Rajender

తెలంగాణలో కేసీఆర్ ని నమ్మి రెండుసార్లు ఓటు వేశాము. రెండవ సారి ఓటు వేసిన తర్వాత కెసిఆర్ కి కళ్ళు నెత్తికి ఎక్కాయి. ప్రజలను మర్చిపోయి చక్రవర్తిలాగా, రాజులాగా పరిపాలిస్తున్నారు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేదు అని మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్న “పాలక్” ఈటెల రాజేందర్ విమర్శించారు.

గుడిసెల్లో ఉన్నవారు, ప్లాస్టిక్ సీట్ల కింద బతికేవారు, మురికి కాలువల వెంట కిరాయికి ఉండేవాళ్లు, పల్లెల్లో ఉపాధి లేక పట్నానికి వచ్చి రెక్కాడితే గాని డొక్కాడని పేదలు అందరికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని కేసీఆర్ చెప్పారు. ఆ మాటలు అమలు అయ్యాయా లేదా గుర్తు చేసుకోండి అని ఆయన కోరారు.

తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వారికి ఆశాభంగం అయింది. లక్షలలో ఉద్యోగాలు నింపుతున్నమని రోజు పేపర్లలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. కానీ పేపర్ లీక్ అయిందని నోటిఫికేషన్లు రద్దు చేస్తున్నారు. ఉద్యోగాలు రావడం లేదని మన కళ్ళముందే పెళ్లిళ్లు కాక, వయసు మీద పడిందని, అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక చనిపోతున్నానని క్షమించమని ఉత్తరాలు రాస్తున్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంతవరకు 3116 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు.

నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయాయి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటూ ఈటెల విమర్శించారు. ధరణి అని పెట్టి తన భూములు ఉంటాయో పోతాయో బెంగ పడేలా చేశారని, ఎక్కడపడితే అక్కడే బ్రాందీ షాపులకు అనుమతులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పెన్షన్లకి 45 లక్షల మందికి ఆయన ఇచ్చేది కేవలం 9000 కోట్లు, పుస్తెలతాడు కడుతున్నప్పుడు ఇచ్చే డబ్బు కేవలం 2000 కోట్లు మాత్రమే.. రైతులకు ఇస్తున్నది కేవలం 9, 10 వేల కోట్లు మాత్రమే..మూడు కలిస్తే కూడా 22000 అవుతున్నాయి..

కానీ మనం తాగడం ద్వారా సర్కారుకు కడుతున్న డబ్బు 45 వేల కోట్ల రూపాయలు అని రాజేందర్ వివరించారు. ఈ ర్యాలీలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రదీప్ రావు, అచ్చ విద్యాసాగర్, కుసుమ సతీష్, రమణ, మోహన్ ఆచారి, యోగానంద్ పాల్గొన్నారు.

Related posts

పరువునష్టం దావా కేసులో రాహుల్ దోషి

Satyam NEWS

జర్నలిస్టులను ఆదుకోవడానికి మానవత్వ దృక్పథంతో ముందుకు రావాలి

Satyam NEWS

అనకాపల్లి సబ్ జైల్ కు నూతన నాయుడు

Satyam NEWS

Leave a Comment