28.7 C
Hyderabad
April 27, 2024 05: 27 AM
Slider ఖమ్మం

సిటీ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

#KhammamPolice

ఖమ్మం సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగ సేవలు శనివారం నుంచి పాత పోలీసు కమిషనర్ కార్యాలయంలో  కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.

ఇటీవల నూతన పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన నేపథ్యంలో సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని పాత పోలీసు కమిషనర్ కార్యాలయంలో కేటాయించటంతో పునరుద్ధరణ పనులు చేపట్టి అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు నగరంలోని పాత పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో వున్న  సిటీ స్పెషల్ బ్రాంచ్,పాస్‌పోర్ట్ సెల్, కాల్ డేటా అనాలిసిస్ సెంటర్ సేవలు పాత సిపిఓ కార్యాలయంలో అందుబాటులో వుంటాయని పోలీసు కమిషనర్  తెలిపారు.

ప్రస్తుతం వున్న  సిటీ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని  టాస్క్ ఫోర్స్ కు కేటాయించినట్లు  తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్  డీసీపీ ఆడ్మీన్ ఇంజరాపు పూజ,అడిషనల్  డీసీపీ లా&ఆర్డర్ మురళీధర్, ఏఆర్ అడిషనల్  డీసీపీ మాధవరావు , ఎస్ బి ఎ సిపి  ప్రసన్న కుమార్ ,

టౌన్ ఏసీపీ అంజనేయులు, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ , టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు , సీసీఆర్బీ ఏసీపీ నాయక్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, ఎఓ అక్తరునీసాబేగం,సిఐలు సంపత్ కుమార్ , వినోద్, చిట్టిబాబు ,శ్రీధర్, సర్వయ్య, శ్రీనివాస్ , సాంబరాజు,అంజలి, సురేష్,  RI లు రవి,శ్రీనివాస్, సాంబశివరావు ,తిరుపతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాబాయి హత్య కేసులో వై ఎస్ జగన్ పెదనాన్నను విచారించిన సీబీఐ

Satyam NEWS

రిమెంబరింగ్: డోన్ లో సరోజినీ నాయుడు జయంతి

Satyam NEWS

ట్రిబ్యూట్: అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయికి

Satyam NEWS

Leave a Comment