37.2 C
Hyderabad
April 26, 2024 19: 57 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా

#AP High Court

ఏపీ హైకోర్టు సిబ్బందిని కరోనా ఊపేస్తున్నది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టంతో న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే విచార‌ణకు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. వాటిని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌రపాలని నిర్ణయించింది. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ విధానంలో కేసుల విచారణ‌లో పాల్గొంటారు.

అలాగే దాఖలయ్యే వివిధ పిటిష‌న్లు సైతం ఈ-ఫైలింగ్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఈ మెయిల్‌లో అటాచ్‌మెంట్లు స్వీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. తాజా మార్పులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ బుధ‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకిన విష‌యం తెలిసిందే. గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ మృతి చెందిన విషయం విదితమే.

Related posts

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం

Satyam NEWS

షాపుల ఎదుటే వంట వార్పు చేసి నమాజు తో నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment