29.2 C
Hyderabad
October 10, 2024 19: 36 PM
Slider తెలంగాణ

వైరల్ అయిన కొల్లాపూర్ ఎమ్మోల్యే మాటలు

mla kollapur

పార్టీ ఫిరాయించే సమయంలో మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెబుతుంటారు కొందరు ఎమ్మెల్యేలు. ప్రజల అభీష్టం మేరకే పార్టీ మారుతుంటామని చెబుతుంటారు మరి కొందరు. పార్టీ మారిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకునేది ఎందరు? నియోజకవర్గం అభివృద్ధి చేయడం పక్కన పెట్టి కుంటి సాకులు చెబుతూ కాలం గడుపుతుంటారు మరి కొందరు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే రావడం ఖాయం. ఆయన ఉపాధ్యాయ సన్మాన సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాను చెప్పే మాటలు మీడియా వాళ్లు ఎక్కడా రాయద్దని కూడా హర్షవర్ధన్ రెడ్డి ముందుగానే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందట అందుకే తాను అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడట. ఈ విషయం అక్కడ ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఉపాధ్యాయుల సన్మాన సభ. అయినా ఎమ్మెల్యే చెప్పేసి పత్రికల వాళ్లకు కాదు ఈ విషయం అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఒకటే చర్చ వినిపిస్తుంది. రాష్ట్రానికి ఆర్ధిక మాద్యం ఉందని స్వయంగా ఎమ్మెల్యే నే చెప్పాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో అర్థం చేసుకోవాలని  స్థానిక ఉద్యోగులు అనుకుంటున్నారు. నిజంగా అక్కడ ఈ మాటలు చెప్పే సందర్భమే కాదు. అక్కడ సుమారు మూడు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ సభలో ఎమ్మెల్యే  మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా  మారాయి. రాష్ట్రంలో  ఆర్థిక మాంద్యం ఏర్పడిందని అందుకే అభివృద్ధి ముందుకు సాగడం లేదని ఆయన అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతుంటారు. దేశం మొత్తం మన సంక్షేమాలను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంటున్నారు. మరి సీఎం, మంత్రులు  మాట్లాడిన మాటలు ఉత్తవే అనిపించేలా ఎమ్మెల్యే మాటలు ఆనిపిస్తున్నాయి. అంటూ ఇక్కడ చర్చ జరుగుతున్నది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నాడా అంటూ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

పది రోజుల తర్వాత ఇంటికెళ్లిన చంద్రబాబు

Satyam NEWS

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS

యువకుడి పై ఎలుగుబంటి దాడి

Bhavani

Leave a Comment