Slider మహబూబ్ నగర్

రేపు కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కు అనుమతి

#Kollapur Municipal Office

కొల్లాపూర్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని టెలి కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించాలనే మున్సిపల్ చైర్ పర్సన్ ఆలోచనను అడ్డుకున్న జిల్లా కలెక్టర్, ఆఖరు నిమిషంలో నేరుగా భౌతిక దూరం పాటిస్తూ సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

ఆర్ధిక పరమైన అంశాలు ఎజెండాలో ఉన్నందున టెలి కాన్ఫరెన్సు ద్వారా సర్వ సభ్య సమావేశం నిర్వహించడం మంచిది కాదని జిల్లా కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్సు ద్వారా కాకుండా ప్రత్యక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు పి.రాములు జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ఎంపి కోరిక మేరకు ప్రత్యక్షంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడానికి కలెక్టర్ అనుమతిచ్చారు.

అయితే కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించాలని ఆయన షరతు పెట్టారు. అందుకు పెద్ద హాల్ అవసరం అయితే తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ సమావేశం నిర్వహించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఆయన కోరారు. కరోనా నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని జిల్లా కలెక్టర్ హితవు పలికారు.

Related posts

జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి

Satyam NEWS

విజయనగరంలో తగ్గిన పోలీసు “స్పందన” బాధితుల సంఖ్య

Satyam NEWS

పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిన తెల్లదోమ

mamatha

Leave a Comment