Slider ముఖ్యంశాలు

గుండె గుభిల్లుమనిపించిన వేంకటరమణ దీక్షితుల డిమాండ్

#Venkataramana Deekshitulu

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారుడు వేంకట రమణ దీక్షితులు చేసిన సూచన ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మాలని నిర్ణయం తీసుకుని ఒక్క సారిగా వేంకటేశ్వరుడి భక్తుల ఆగ్రహానికి గురైన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ తప్పును తాత్కాలికంగా సరిదిద్దుకున్నది. అయితే వివాదం మాత్రం అలానే ఉన్నది.

ఈ దశలో వేంకట రమణ దీక్షితులు చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలవర పరచి ఉంటాయని చెప్పవచ్చు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్ధాయిలో ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి తన డిమాండ్లను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి ట్వీట్ చేశారు.  

Related posts

ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకుడిని కాదు

Satyam NEWS

కుంటాల, పోచ్చెర జలపాతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దండి

Satyam NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ లో కరోనా సేవలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment