40.2 C
Hyderabad
April 29, 2024 17: 10 PM
Slider మహబూబ్ నగర్

కేసీఆర్ ఆశయానికి తూట్లు పొడుస్తున్న ముఖ్య నాయకులు

#Kollapur Tank

రైతు కళ్ళలో ఆనందం చూడాలని ప్రతి చెరువు కుంట నీటితో నిoడుకుండలా ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలను అడియాశలు చేస్తూ కొల్లాపూర్ ముఖ్య నాయకుడి ప్రమేయంతో కావలోనికుంట చెరువు కబ్జాక చేస్తున్నారు.

గత నెల రోజుల నుండి కొల్లాపూర్ లో జరుగుతున్న భూకబ్జా ల గురించి చర్చ జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చెరువులను కూడా వదలకుండా ముఖ్యనేతలు చెరపడుతున్నారు.

గత వారo రోజుల క్రితం నియోజకవర్గ నాయకుని అండదండలతో వారి ముఖ్య అనుచరులు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న యాదవుల భూముల పై కన్ను వేశారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి అప్పజెప్పిన  900.6 గుంటల భూములపై నియోజకవర్గ నాయకుని ప్రమేయంతో ప్రభుత్వ భూమి గా మార్చి కొన్ని కోట్ల రూపాయల కు బేరం కుదుర్చుకున్నారు.

రిజర్వ్ ఫారెస్టు లో ఉన్న ఈ భూములను ప్రభుత్వం భూములు గా మార్చకుండా నిబంధనలు మాట్లాడినందుకు రాత్రి కి రాత్రి తహసీల్దార్ ను బదిలీ చేయడం గమనార్హం. మునిసిపల్ చట్టం ప్రకారం ఎలాంటి అనుమతులు లేకపోయినా తన అనుచరుడు అయినందుకు అక్రమ వెంచర్లకు కూడా కొల్లాపూర్ ముఖ్య నాయకుడు మద్దతు పలకడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు వారి కన్ను చెరువుల పై పడింది. కొల్లాపూర్ పట్టణం వరిదేల శివారు లో గల  కావలోనికుంట చెరువు పై ఈ నాయకుని అనుచరుల కన్ను పడింది. FTL హద్దుల ప్రకారం ఉండాల్సిన చెరువు ను ఈ నాయకుని ముఖ్య అనుచరుడు కబ్జా చేసేశాడు. ఇరిగేషన్ అధికారులు చెరువు హద్దులు ఏర్పాటు చేసి చూపించారు కానీ వారి ఆదేశాలను ఈ నాయకులు పెడచెవిన పెట్టారు.

మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం అనేరీతి లో FTL లో ఉన్న చెరువు భూమి ని కబ్జా చేశారు. అంతే కాకుండా అక్కడ అక్రమ వెంచర్ లు కూడా వేశారు. సర్వే చేయడానికి వచ్చిన  అధికారులకు బెదిరింపులు ఎదురుకావడంతో అధికారులు కూడా ఈ వెంచర్ గురించి మాట్లాడటానికి బెంబేలెత్తతున్నారు.

ఇరిగేషన్ అధికారులు నేడు మళ్లీ వచ్చి చెరువు కు సంబంధించిన హద్దులు పరిశీలించారు. అందులో చెరువు FTL లో ఉన్న భూమి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

తమ ప్రాంత చెరువు ఆక్రమణలకు గురి కాకుండా జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు  అందరూ వారి రూల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ హన్మంత్ నాయక్, కౌన్సిలర్ లు రహీం, నయీమ్, సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నర్సింహ, మాజీ సర్పంచ్ నాగరాజు, టీఆర్ఎస్  పార్టీ నాయకులు బరిగెల వేణు  మద్దెల రామదాసు, హరిప్రసాద్  డిమాండ్ చేశారు.

Related posts

కాపు భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఇవ్వాలి

Satyam NEWS

వివాదాస్పద నేత గోపాల్‌ కందా మద్దతు తీసుకోం

Satyam NEWS

మహాత్ముడికి కరీంనగర్ పోలీసుల ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment