డయాలసిస్ రోగులు పడుతున్న ఇబ్బందులు తన మనసును కలచివేస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 50 అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ రోగులు పడుతున్న ఇబ్బందులు తన మనసుని కలచివేశాయని, వారికి పింఛన్ అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు మంత్రి ఈటల. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో 50 అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు లేవని కేవలం వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. స్వయంగా తాను నాలుగు జిల్లాల్లో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశానని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోదావరిఖని ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని భాజపా నాయకులు మంత్రి ఈటల ఎదుట నిరసన చేపట్టి వినతి పత్రాన్ని అందజేశారు
previous post