విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు రెండో రోజు జగన్మాత దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇస్తున్నది. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు.
previous post