29.7 C
Hyderabad
May 2, 2024 06: 11 AM
Slider రంగారెడ్డి

పి ఆర్ ప్రాజెక్ట్ ను పరిశీలించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు

#palamururangareddy

పనులను నిలిపివేసి ఎక్కడికక్కడ జాగ్రత్త పడిన కాంట్రాక్టర్స్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై కోర్టు స్టే ఇచ్చిన కానీ పనులు జరుగుతున్నాయని సమాచారంతో  కృష్టానది యాజమాన్య బృందం బుధవారం పర్యటించి, పరిశీలించింది. ప్రాజెక్టు అధికారులతో పీఎల్‌ఆర్‌ఐ పనులపై కేఆర్ఎంబీ అధికారులు ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 1, 2, 3, 4 పనులను కృష్ణా యాజమాన్య బోర్డు అధికారులు పరిశీలించారు. ఎల్లూరు సమీపంలోని ప్యాకేజీ-1లో సొరంగం, సున్నపు తండా దగ్గర ప్యాకేజీ-2 రిజర్వాయర్ కట్ట, ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, మెయిన్ కెనాల్ పనులను కృష్ణా యాజమాన్య బోర్డు అధికారులు ప్రకాశ్‌, సత్యనారాయణరెడ్డి.. ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు.కృష్ణాబోర్డు అధికారులకు ప్రాజెక్టు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనులు, నీటి విడుదల వివరాలు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశానుసారం కృష్ణాబోర్డు, సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడం వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. కోర్టు స్టే ఇచ్చిన పనులు జరుగుతున్నాయని సమాచారంతో బృందం పర్యటించి నట్లు సమాచారం.బృందం రాకతో ఎక్కడికక్కడ పనులు నిలిపి వేసినట్లు స్థానికుల నుండి అందిన సమాచారం.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

అన్ని హామీలూ నెరవేరుస్తున్న మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS

ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా

Satyam NEWS

హనుమాన్ జంక్షన్ లో కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment