32.7 C
Hyderabad
April 27, 2024 02: 52 AM
Slider నిజామాబాద్

రుణ మాఫీ నిధులు విడుదలపై రైతుల సంబురాలు

#Nizamabad Farmers

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా రూ.25 వేల లోపు రుణం కలిగిన 6.10 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా రూ. 1200 కోట్లను విడుదల చేసినందుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల టీఆరెస్ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్ మాట్లాడుతూ మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

కరోనా కష్ట కాలంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవని బాధపడుతున్న  రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన రైతు బాంధవ్యుడు, రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ కు కోటగిరి మండల రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ గంగాధర్,సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, నాయకులు అనిల్ కులకర్ణి,బొట్టె గజేందర్, పందిముక్కుల సాయిలు,దేవుడు సాయిలు,రైతులు బీర్కూర్ సంతోష్, బర్ల గంగారాం,ఒడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజారెడ్డి రాజ్యాంగం నశించాలని రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం

Bhavani

నిజమైన మహిళా బంధు కేసీఅర్ : ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

కమిషన్లకు కక్కుర్తితో ఆసుపత్రి విస్తరణలోఅలక్ష్యం

Satyam NEWS

Leave a Comment