42.2 C
Hyderabad
April 26, 2024 16: 50 PM
Slider నల్గొండ

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

#All Party Farmers

అఖిల భారత రైతు సమన్వయ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఇందిరా సెంటర్ లో మిత్ర పక్షాల రైతు సంఘాలు,CPI,CPM,CPI ml, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రైతు కౌలు సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పోలు సూర్యనారాయణ,CPM పట్టణ కార్యదర్శి నాగారపు పాండు,CPI ml అజయ్, మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను భగ్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వెన్నుముకైన రైతులపై బాష్పవాయువు,టియర్ గ్యాస్ ప్రయోగించటం ఆపాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల ప్రతినిధులతో షరతులు లేని చర్చలకు ఆహ్వానించాలని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు,సిపియం పార్టీ మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య,CPI ml నూకలు చంద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, యల్లావుల రమేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,

బాదె నర్సయ్య,దుగ్గి బ్రహ్మం, వాసుదేవరావు,రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, జిల్లా CITU నాయకులు శీతల రోషపతి,వీరమల్లు, జానీ,యల్క సోమయ్య గౌడ్, జక్కుల వెంకటేశ్వర్లు, చందర్రావు, రేపాకుల మురళి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్లైడ్ లైట్ల వెలుగులో విజయనగరానికి పైడితల్లి సిరిమాను చెట్టు…

Satyam NEWS

పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న తెలంగాణ

Satyam NEWS

ఖమ్మం కు మరో 100 కోట్లు

Bhavani

Leave a Comment