మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్s పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం నాడు టిఆర్ఎస్ భవన్ లో పద్మారావు నగర్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ కేటీఆర్ ను కలిసి బంగారు ప్లేట్ పై చెక్కిన కేటీఆర్ బొమ్మను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ కు జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బాబురావు, శైలేందర్, కృష్ణ గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.