ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలోని బ్యాంకర్లు రైతుల అవసరాలు తీర్చేందుకు రుణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కోరారు. నేడు పదమూడు జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడే విధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నచర్యలకు బ్యాంకర్లు అండగా నిలవాలని ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్థ బాగుంటుందని ఆయన అన్నారు. ఆర్దికంగా ఎదుగుతున్నప్పుడు నష్టపోకపండా ఏవిధంగా చర్యలు తీసుకోవాలి అనేదానిపై బ్యాంకర్లు దృష్టిపెట్టాలని ఆయన కోరారు. రైతుల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏవిధంగా సహాయం చేయగలుగుతామో బ్యాంకర్లకు వివరించారు. రైతులు ఇబ్బంది పడినప్పుడు బ్యాంకర్లు ఏవిధంగా ముందుకు రావడం లేదని, వారిని ఆదుకోవడం తమ విధి అని బ్యాంకర్లు గుర్తించాలని సుబ్రహ్మణ్యం అన్నారు. అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి వారికి చేయూత కల్పించడం కూడా బ్యాంకర్ల లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం అధ్యక్షుడు పకిరిసామి మాట్లాడుతూ 2022 కల్లా బ్యాంకింగ్ వ్యవస్దలో సమూలమార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రధాని పిలుపుమేరకు ఎకానమీని పెంచే విధంగా బ్యాంకర్లు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
previous post
next post