38.2 C
Hyderabad
April 29, 2024 13: 46 PM
Slider ముఖ్యంశాలు సినిమా

వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఆదిత్య అరుణాచలం

rajanikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సారి మురుగదాస్ తో కలిసి వచ్చేస్తున్నాడు. దర్బార్ పేరుతో మిమ్మల్ని అందర్నీ కట్టపడేసే కథతో వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలంగా పోలీస్ డ్రెస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ప్రతి అభిమానితో విజిల్స్ వేయించేలా ఉంది. పోలీస్ యూనిఫామ్, చేతిలో కత్తి, బ్లాక్ గాగ్స్ తో ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో వచ్చే ఫైట్ సీన్ నుంచి డిజైన్ చేసిన ఈ పోస్టర్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా తలైవా అన్న బీజీఎమ్ రాగానే ఫేస్ పై స్మైల్ తో, చైర్ లో దర్జాగా కూర్చున్న రజినీ, స్టైల్ ఐకాన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించాడు. వయసుతో సంబంధం లేకుండా మెస్మరైజ్ చేసే రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి మోషన్ పోస్టర్ తో ప్రొమోషన్స్ మొదలుపెట్టిన మురుగదాస్ అండ్ టీం భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అయిన దర్బార్ సునామి, సంక్రాంతికి థియేటర్స్ కి తాకనుంది. తెలుగు తమిళం హిందీ మలయాళం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకి దర్బార్ సునామీ వ్యాపించింది.

Related posts

Raamateerdham Effect: విద్యలనగరం మొత్తం ఖాకీ మయం….!

Satyam NEWS

ఎట్టకేలకు ఫలించిన శ్రీ వాణి దీక్ష: దిగివచ్చిన ప్రియుడు

Satyam NEWS

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment