29.7 C
Hyderabad
April 29, 2024 07: 23 AM
Slider నల్గొండ

నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా రిక్షా కార్మికుల రేట్లు పెంచాలి

#roshapati

అసంఘటిత రంగంలోని కార్మికులకి సముగ్ర వేతన చట్టం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక పబ్లిక్ క్లబ్ నందు ప్లాట్ ఫామ్ రిక్షా కార్మికుల సమావేశంలో పాల్గొన్న రోషపతి  మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఫ్లాట్ ఫామ్ రిక్షా కార్మికులకి,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కిరణ షాపుల అసోసియేషన్ ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని కోరారు.గతంలో రెండు సంవత్సరాల ఒకసారి జరిగిన అగ్రిమెంటు పూర్తి అయినందున తిరిగి అగ్రిమెంట్ తక్షణమే చేయాలని కోరారు.

సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ రిక్షా కార్మికుల డిమాండ్ల పత్రాన్ని జూన్ నెల 29వ,తేదీన చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల రమేష్ కి ఇవ్వడం జరిగిందని అన్నారు.అర్హులైన కార్మికులకి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, కరోనా సమయంలో పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న కార్మికులకి నెలకి 7500 రూపాయల చొప్పున రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఇప్పించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్లాట్ ఫారం రిక్షా అధ్యక్ష్య,కార్యదర్శులు పంగ సైదులు,పిట్టల రమణయ్య,పంగ నరసింహారావు, శీలం సోమయ్య,రామిరెడ్డి,గోపి,రాములు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

కరోనాతో భయపడొద్దు.. అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దు

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: ఆ నలుగురికి ఉరి అమలు

Satyam NEWS

భూ వివాదం పై చంపుతామని న్యాయవాదికి బెదిరింపు

Satyam NEWS

Leave a Comment