31.7 C
Hyderabad
May 2, 2024 08: 50 AM
Slider కరీంనగర్

వేములవాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

#Adisrinivas

సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాగానే యువతకు పెద్దపీట వేశారని తెలిపారు. 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన మహానేత రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు.

అదే విధంగా తన పాలనలో బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో మొదటిసారిగా కంప్యూటర్ల ప్రాధాన్యతను గుర్తించి దేశంలో కంప్యూటరీకరణ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ దే అని ఆయన గుర్తు చేశారు.

రాజీవ్ గాంధీ మరణించడం చాలా బాధాకరమని, ఆయన ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన కోరారు.

ఢిల్లీ నుండి నేరుగా పల్లెలకు నిధులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ ఆయన గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆటో కార్మికులకు శానిటైజర్ లో మాస్కులు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా మహమ్మారి కి ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కూరగాయల కొమురయ్య, నాగుల విష్ణు ప్రసాద్, అరుణ్ తేజ చారి, కనికరపు రాకేష్ , వస్తాదు కృష్ణ, నరేష్ ,కోలకాని రాజు, సాబీర్, బాల బ్రహ్మం, మర్రి పెళ్లి రాజు తదితరులు ఉన్నారు.

Related posts

ఈబీసీ కింద ఆర్యవైశ్యులకు 70 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ దే

Satyam NEWS

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలు

Satyam NEWS

జ‌గ‌న్ ప్రభుత్వ చేతకాని తనానికి ఆర్టీసీ డ్రైవర్ల బలి కావాలా…?

Satyam NEWS

Leave a Comment