18.7 C
Hyderabad
January 23, 2025 02: 06 AM
Slider ఆంధ్రప్రదేశ్

జేసీ దివాకర్ రెడ్డి పై కొనసాగుతున్న కక్ష సాధింపు

jc diwakar reddy

తెలుగుదేశం పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి కి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజులను ప్రభుత్వం నేడు రద్దు చేసింది. అనంతపురం జిల్లా యాడికి లో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులు ఈ కంపెనీకి ఉన్నాయి. యాడికి లోని కొనుప్పలపాడులోని సర్వే నెంబరు 22 బిలో ఇది ఉంటుంది. ఈ లీజుల్ని ప్రభుత్వం రద్దు చేసింది.

సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నది.

లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం , రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts

కమలానికి కలిసి వచ్చే కాలం ఇది కాదు

Satyam NEWS

రాజంపేట లో భారీగా జెండా పండుగకు సన్నాహాలు

Satyam NEWS

గంగా విలాస్ క్రూయిజ్ ను ప్రారంభించిన ప్రధాని

mamatha

Leave a Comment