40.2 C
Hyderabad
April 29, 2024 16: 27 PM
Slider ముఖ్యంశాలు

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

#murder case

గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం,ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీ పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు.

నిందితులపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో Cr.no 165/22,U/s 302,353,332 r/w 34 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైన ఈ కేసులోని నిందితులు మడకం తులా మరియు పోడియం నంగా లను పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగింది.

హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.వినీత్ అన్నారు.నేరం చేసిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష పడుతుందని తెలియజేసారు.నిందితులకు ఇద్దరికీ శిక్ష పడేవిధంగా కృషిచేసిన విచారణాధికారి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణ,కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రవి,లైజన్ ఆఫీసర్ వీరబాబు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.

Related posts

పిల్లలకు చదువుతో పాటు గేమ్స్ తప్పకుండా అవసరం

Satyam NEWS

టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌

Satyam NEWS

గుర్తుచేసుకుందాం….

Satyam NEWS

Leave a Comment