29.7 C
Hyderabad
April 29, 2024 08: 38 AM
Slider ఆదిలాబాద్

సర్వీస్ ఎఫైర్: కాగజ్ నగర్ లో లయన్స్ క్లబ్ రీజియన్ మీట్

lions club 1

కాగజ్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీజియన్ మీట్ (320G రీజియన్-6) ఘనంగా జరిగింది. చైర్మన్ లయన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్mjf, జోన్ చెర్మెన్ లయన్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఈ ప్రాంతీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ DVN రాజు హాజరయ్యారు.

ఆయనతో బాటు పూర్వ జిల్లా గవర్నర్ శివ ప్రసాద్, రెండోవ వైస్ జిల్లా గవర్నర్ నాగుల సంతోష్, జిల్లా కోశాధికారి బొడ్ల మహేష్, సహా RC లు మధుసూదన్ రెడ్డి, సంపత్, రమణ రెడ్డి, పూర్వపు rc లు k సత్యనారాయణ, నారాయణ, నారాయణ రెడ్డి,  మైక్రో కేబినెట్ మెంబర్ లయన్ హనుమాన్ రాజిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న 10 క్లబ్బుల ప్రెసిడెంట్, సెక్రెటరీ, ట్రెజరర్ లకు అవార్డులు ప్రధానం చేశారు. లయన్స్ క్లబ్ రీజియన్-6 ZC లయన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, కె జగన్, బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు మమత రెడ్డి, బెస్ట్ క్లబ్ అవార్డు లైన్స్ క్లబ్ ఆసిఫాబాద్, స్టార్ ఆఫ్ ది రీజియన్ వెంకటరమణ రెడ్డి mjf లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలకు గాను పలువురికి జ్ఞాపికలు అందజేశారు.

అనంతరం లయన్ డివిఎస్ రాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ లయన్స్ క్లబ్ సభ్యులు వివిధ రీజియన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కస్తూరిబా కళాశాలల సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

Satyam NEWS

కాలనీలలో ఎలాంటి సమస్యలున్నా సత్వరమే పరిష్కరిస్తా

Satyam NEWS

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో వైభవంగా ధ్వజావరోహణం

Bhavani

Leave a Comment