39.2 C
Hyderabad
May 3, 2024 13: 14 PM
Slider ప్రత్యేకం

ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్న మద్యం ఆదాయం

#raghurama

రాష్ట్రంలో 20%తో ప్రారంభించిన నాన్ డ్యూటీ పెయిడ్  ( ఎన్ డి పి ) సరుకు  ఏడాదికి 10 శాతాన్ని పెంచుకుంటూ 50 శాతానికి  పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఎన్డీపీ సరుకు అధికంగా ఉండడం వల్లే మద్యం అమ్మకాలను  నగదు లోనే కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలను ఆన్లైన్లో చేపట్టాలని ఎంతోమంది కోర్టును ఆశ్రయిస్తే 100 షాపుల్లో  ఆన్లైన్ విక్రయాలను చేపట్టారు. ఆన్లైన్ విక్రయాలను  పర్యవేక్షించే బాధ్యతలను కూడా అస్మదీయుల కంపెనీకే కట్టబెట్టారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

నాన్ డ్యూటీ పెయిడ్  సరుకును  ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్  కార్యదర్శి వాసుదేవ రెడ్డి కొనుగోలు చేస్తున్నారు. డ్యూటీ పెయిడ్ సరుకు తో కలిపి, ప్రభుత్వ మద్యం దుకాణాలలోనే నాన్ డ్యూటీ పెయిడ్ సరుకును  విక్రయిస్తున్నారు. డ్యూటీ పెయిడ్ సరుకు ద్వారా  ఏడాదికి  25 నుంచి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంటే, అంతకంటే ఎక్కువే నాన్ డ్యూటీ పెయిడ్ సరుకు ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలలోకి ఆదాయం వెళ్తోందని రఘురామ కృష్ణంరాజు  అన్నారు.

రాష్ట్రంలోని డిస్టలరీలకు గత ప్రభుత్వ హయాంలోనే  అనుమతులు ఇచ్చారని  మంత్రులు, మా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ డిస్టలరీలు ఎవరు నిర్వహిస్తున్నారు మాత్రం చెప్పడం లేదు.. రాష్ట్రంలోని పిఎంకె డిస్టలరీస్ కు అనుబంధంగా అడాన్ డిస్టలరీస్, పిఎంకె డిస్టలరీస్  లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించి  వేల కోట్ల టర్నోవర్  నిర్వహిస్తున్నాయి. పిఎంకె డిస్టలరీస్ లో  హరి ప్రసాద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజారెడ్డి, చల్లా మధుకర్ రెడ్డి లు భాగస్వాములుగా ఉన్నారు.

తొకడ బ్రాండ్లను విక్రయిస్తూ, కోట్ల రూపాయలను  అర్జిస్తున్నారు. గ్రేసన్ డిస్టలరీస్, ఎస్ పి వై ఆగ్రో  లను కూడా రెడ్డి లే నిర్వహిస్తున్నారు. ఎస్పీవై ఆగ్రో ను మా పార్టీ  పార్లమెంట్ పదవుల్లో ఉన్న నాయకుల కనుసనల్లో కొనసాగుతోంది. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 25 వేల కోట్ల ఆదాయం లభిస్తుండగా, ప్రైవేటు వ్యక్తులకు 40,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నట్లు  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. మద్యం వ్యవహారాలన్నీ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాదులో రాజ్ కసిరెడ్డి  ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారు.

వీటన్నిటి లెక్కలు తేలాలంటే  సిబిఐ దర్యాప్తు  చేపట్టాల్సిందేనని రఘురామకృష్ణం రాజు కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి  లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా తింటున్నారు. రాష్ట్రంలో నాసిరకమైన మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పేర్కొంటూ, మద్యం తాగి ఆసుపత్రి పాలైన వారిని  కూడా పరామర్శించారు.

రాష్ట్రంలో కావలసిన మద్యం కొనుక్కునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల యువకులు కూడా  నాసిరకమైన మధ్యాహ్నం సేవించి  లివర్, కిడ్నీ పాడై ఆస్పత్రిల పాలవుతున్నారు. ఈ తోకడా బ్రాండ్లను తాగి టపా,  టపా అంటూ టపా కట్టేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో సామాజిక రుగ్మతగా తయారయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిరోజు సామాన్యుడి నుంచి 300 రూపాయలు లాగేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వారి ఆరోగ్యాన్ని కూడా హరిస్తున్నారు. ఎవరైనా శాశ్వతంగా బతుకుతారా? వందేళ్ళ కంటే ఎక్కువగా బతకలేరు కదా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి 52 ఏళ్ళు ఉన్నాయి. మహా అయితే మరో 48 ఏళ్ల పాటు బ్రతకవచ్చు. 48 ఏళ్లు జీవించడానికి ఎంత డబ్బులు కావాలి… మహిళల మాంగల్యాన్ని తెంచడం  అవసరమా? అంటూ రఘురామకృష్ణంరాజు శరపరంపరంగా ప్రశ్నస్త్రాలు సంధించారు.

ఎన్నికలకు ముందు దశలవారీగా  మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి మహిళలను మోసగించినందుకు వారు మా పార్టీకి   ఓటు వేసే అవకాశమే లేదు. మగవారి జేబు దోపిడీ కి పాల్పడడంతో , వారు కూడా మా పార్టీకి ఓటు వేయరు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కల్పించిన పాపాన పోలేదు. దీనితో నిరుద్యోగులు కూడా మా పార్టీకి దూరమే. ఉద్యోగస్తులను తీవ్రంగా వేధించారు. ఈసారి ఇద్దరు రెడ్డి నాయకులు, మరొక నాయకుడు   మినహా, మా పార్టీకి మిగతా ఉద్యోగుల ఓట్లు పడే అవకాశం లేదు. ఏతా వాత ఎటు చూసినా రానున్న ఎన్నికల్లో మా పార్టీకి ఏ ఒక్కరూ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో గెలిచే ఛాన్సే లేదని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు.

Related posts

త‌ర‌లిపోతున్న గో సంప‌ద‌…ఒక్క రోజులో వంద ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు…?

Satyam NEWS

కృష్ణపట్నం ఆనందయ్యకు ఏడు ప్రశ్నలు

Satyam NEWS

పేదలకు సోనియాగాంధీ రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment