22.2 C
Hyderabad
December 10, 2024 11: 21 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఘనంగా ఉక్కుమనిషి సర్దార్ పటేల్ జయంతి

president

అఖండ భారతావని లక్ష్యంగా స్వతంత్ర భారతావనిని పటిష్టం చేసిన భరతమాత ముద్దుబిడ్డ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. గుజరాత్‌లోని కేవడియాలో పటేల్ ‘‘ఐక్యతా విగ్రహాన్ని’’ సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన ఏకతా దివస్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. టెక్నాలజీ ప్రదర్శనను తిలకించడంతో పాటు కేవడియాలో సివిల్ సర్వీస్ ప్రొబెషనర్లతో ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ… ‘‘సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం’’.. అని పేర్కొన్నారు. 2014 నుంచి ప్రతి యేటా అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం ‘‘జాతీయ ఐక్యతా దినోత్సం’’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ సహా ఏడుగురు సీఎం లు డుమ్మా

Bhavani

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజున రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment