38.2 C
Hyderabad
April 28, 2024 19: 12 PM
Slider నల్గొండ

నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

#cashtransffer

ప్రభుత్వం గొర్రెలకు బదులుగా, నగదు బదిలీ స్కీంను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, వీరబోయిన రవి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తిరుమలగిరి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి మండల తాసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

అనంతరం మండల అధ్యక్షులు కడారి లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెం లింగయ్య, వీరబోయిన రవి  ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేయడానికి విధివిధానాల రూపొందించి, లబ్ధిదారుల ఖాతాలో ప్రీజింగును ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అవినీతిని నివారించడానికి నగదు బదిలీని ప్రకటించడాన్ని సంఘం జిల్లా కమిటీ గా హర్షిస్తున్నాం.  నగదు బదిలీ అయిన ఖాతాలను ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అకౌంట్లో ఫ్రీజింగ్ తో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని, వెంటనే  ప్రీజింగ్ ను ఎత్తివేసి విధివిధానాలు రూపొందించాలని వారు కోరారు.

అలాగే గొర్రెలకు ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ చేస్తామని హామీ ఇచ్చింది , కానీ ఆచరణలో మాత్రం నిలబెట్టుకోవడం లేదు. దాని వలన తీవ్రంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు గొర్ల కాపర్లు బాగా నష్టపోతున్నారని తిరుమలగిరి మండలం మామిడాల స్టేజి దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ లో 30 గొర్రెలు చనిపోయి ఆర్థికంగా నష్టపోయిన గొర్ల కాపరి కుటుంబానికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల సహకారం అందించాలని వారి సందర్భంగా కోరారు.

ఈ మధ్యకాలంలో జిల్లాలో గొర్రెల దొంగతనాలు పెరుగుతున్నాయి వాటిని నివారించేలా చర్యలు తీసుకోవాలని,గ్రామీణ ప్రాంతంలో 559,1016 జీవాలను సక్రమంగా అమలు చేసి గొర్రెల మేతకు సహకరించాలని తాసిల్దార్ను కోరడం 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపరులకు 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, సొసైటీలలో ఉన్న సభ్యులకు ప్రభుత్వమే ఉచితంగా ఐడి కార్డులు పంపిణీ చేయాలని వారు చదువుకున్న యువకులకు 50 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు అందించి గొర్రెల ఫామ్స్ పెట్టించి, నిరుద్యోగులుగా ఉన్న యువకులకు ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో,   గొర్రె మేకల పెంపకందార్ల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వజ్జె వినయ్ యాదవ్ మండల  కార్యదర్శి కన్నెబోయిన లింగమల్లు, సొసైటీ అధ్యక్షులు బొడ్డు మల్లయ్య, బండ అశోక్, వజ్జె శంకర్, నాలి వెంకన్న, మల్లయ్య,  సైదులు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

Murali Krishna

అధికారులకు ప్రాణ సంకటంగా మారిన ప్రభుత్వ తప్పిదాలు

Murali Krishna

Leave a Comment