మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఉద్ధావ్ ధాకరే అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం అయింది. మహారాష్ట్ర సీఎం పీఠం శివసేనకే అప్పగిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరించాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన చర్చల్లో ఉద్ధవ్ థాక్రేను సీఎంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రతిపాదించాయి. దాంతో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికినట్లైంది. ఉద్ధవ్ థాక్రేను సీఎంగా మూడు పార్టీలు అంగీకరించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అప్పగిస్తారు. అదే విధంగా మూడు పార్టీలూ 14 చొప్పున మంత్రిపదవులు పంచుకుంటాయి. మూడు పార్టీలు కలిసి శనివారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సిద్ధాంతాలకు విరుద్ధంగా కేవలం పదవుల కోసమే ఈ మూడు పార్టీలు కలిశాయని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరి వ్యాఖ్యానించారు. ఇది అపవిత్ర కలయిక అని ఆయన అన్నారు.
previous post