28.7 C
Hyderabad
April 26, 2024 08: 50 AM
Slider గుంటూరు

మంగళగిరి వద్ద మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఘరానా మోసం

#Mangalagiri Police

వెళుతున్న వాహనాలను వెంబడించి అందులోని విలువైన వస్తువుల్ని అపహరిస్తున్నారు దుండగులు. బుధవారం గుంటూరు సమీపంలోని నల్లపాడు తిరుపతి శ్రీ సిటీ నుండి కలకత్తా కు సెల్ ఫోన్ లోడ్ కంటైనర్ వెళుతోంది.

గుర్తు తెలియని వ్యక్తులు  కంటైనర్ వెనుక డోర్ పగుల గొట్టి విలువైన సెల్ ఫోన్ లు ఎత్తుకు పోయారు. దీనిని గమనించిన వేరే వాహన డ్రైవర్ కంటైనర్ డ్రైవర్ ను కాజ టోల్ గేట్ వద్ద అప్రమత్తం చేశాడు.

దీనితో సెల్ ఫోన్ లు చోరీ అయినట్లు తెలుసుకున్న డ్రైవర్ మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు.

మధ్యప్రదేశ్,తమిళనాడు గ్యాంగ్ గా అనుమానిస్తున్నాం

సెల్ ఫోన్ ల చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్ తమిళనాడు గ్యాంగ్ గా అనుమానిస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి  తెలిపారు.

మంగళగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్పీ కంటైనర్ ను పరిశీలించి డ్రైవర్ ను విచారించి వివరాలు తెలుసుకున్నారు.

 అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ మాట్లాడుతూ,రూ.9 కోట్ల విలువైన సెల్ ఫోన్ ల సామాగ్రితో కంటైనర్ బయలుదేరిందని, ఇందులో సుమారు రూ.80 లక్షలు విలువ చేసే 980 నోట్ ప్యాడ్ లు చోరీకి గురైనట్లు చెప్పారు.

 వెళుతున్న కంటైనర్ వెనుక నుండి తలుపు పగుల గొట్టి చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. వెనుక నుండి వస్తున్న డ్రైవర్ అప్రమత్తం చేయటం వల్ల చోరీ నష్టం తక్కువగా ఉందని పేర్కొన్నారు.

సెల్ ఫోన్ సిగ్నల్స్, సిసి టివి ఫుటేజీల దృశ్యాల ఆధారంగా నిందితుల ఆధారాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే ముద్దాయిలను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related posts

వితంతువులు స్వశక్తితో ఎదగాలి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్

Satyam NEWS

29 నుండి జులై 7 వరకు తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Bhavani

వైసీపీ ఎమ్మెల్యే విచ్చలవిడితనం వల్లే ఏపీలో కరోనా

Satyam NEWS

Leave a Comment