31.7 C
Hyderabad
May 2, 2024 09: 16 AM
Slider తూర్పుగోదావరి

స్వచ్ఛభారత్ మున్సిపల్ క్లాప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

#swchbharat

స్వచ్ఛభారత్ క్లాప్ వాహన డ్రైవర్ల వేతనాలు పెంచాలని ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ వాహనాల డ్రైవర్లను నియమించేటప్పుడు రూ.18,500 వేతనం ఇస్తామని చెప్పి నేడు రూ.12,500 చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్ వాహనానికి ఒక్కో వెహికల్ కు నిర్వహణకు రూ.55 వేలు చెల్లిస్తూ మున్సిపాలిటీ నిధులను కాంట్రాక్టుకు ధారాధత్తం చేయడం వెనుక జరిగిన అవినీతిని స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీలో నగర పంచాయతీల్లో వాహన డ్రైవర్లు విధులకు హాజరవుతున్నారని, వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో 4975 మంది క్లాప్ వాహన డ్రైవర్లకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ల పని భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. వాహన డ్రైవర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు.

ప్రతినెల జీతాలు చెల్లించేలా రెడ్డి  కో ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వీరికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దొడ్డికర్ల నాగబాబు, కిలారి వెంకన్న, చోడవరపు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

వరద ముంపు గ్రామంలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి

Bhavani

వైభవంగా లక్ష్మీ నారసింహుడి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment