31.7 C
Hyderabad
May 2, 2024 08: 54 AM
Slider ఆధ్యాత్మికం

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

#makarajyothi

శబరిమలలో మకరజ్యోతి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. మకర జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. అరుదైన దృశ్యాన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ఉప్పొంగిపోయారు. ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం.

ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శన భాగ్యం లభించింది. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పను పూజించారు. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. శబరిమలకు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు నుంచి జ్యోతి దర్శనం కలిగింది.

Related posts

ఉపాధ్యాయ స‌మ‌స్య‌ల‌ సాధనకు ప్ర‌భుత్వంపై యుద్దానికి కార్యాచర‌ణ‌

Satyam NEWS

రాజకీయాలు డబ్బులు సంపాదించేందుకు కాదు

Satyam NEWS

మాల నాగరాజు హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment