32.7 C
Hyderabad
April 27, 2024 00: 27 AM
Slider నల్గొండ

వినాయక చవితి నవరాత్రులు ఇంటిలోనే చేసుకోండి

#Bhrahmin Association

కోవిడ్ – 19 వైరస్ విస్తృతంగా ఉన్న కారణంగా వినాయక చవితి నవరాత్రులను గృహాలలోనే నిర్వహించాలని సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘాల సమావేశం పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లా ప్రధాన కేంద్రంలో శ్రీరామ్ నగర్ లోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జిల్లా బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘాల సమావేశం జరిగింది.

వైదిక బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు మంత్రమూర్తి శంకర మూర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. జిల్లా లోని పలు ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణ వేదమూర్తులు సమక్షంలో అధ్యక్షుడు శంకర మూర్తి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఉగాది, శ్రీరామనవమి పండుగలు ఏవిధంగా గృహాలలో నిర్వహించుకున్నారో అదేవిధంగా  వినాయక చవితి కూడా జరుపుకోవాలని యన కోరారు.

ఈనెల 22 నుండి ప్రారంభం కానున్న నవరాత్రులను గృహాలలోనే నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కరోనా వైరస్ దృష్ట్యా వీధులలోని మండపాలలో వినాయక నవరాత్రులు తాము నిర్వహించలేమని వైదిక బ్రాహ్మణ పురోహిత సంఘాలు తెలియజేశారు. ఈ నిర్ణయానికి ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో దూప దీప నైవేద్యం జిల్లా సంఘం అధ్యక్షుడు అన్నంభొట్ల ఫణి కుమార్ శర్మ, ప్రధాన కార్యదర్శి మంత్రమూర్తి ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షుడు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, కోశాధికారి అరిపిరాల జనార్ధన్ శర్మ, పట్టణ పురోహిత, అధ్యక్ష ,కార్యదర్శులు సుబ్రహ్మణ్య శర్మ, రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

క‌రోనా ఎఫెక్ట్: పైడితల్లి అమ్మ‌వారి పండుగ‌పై పోలీసు శాఖ ఆంక్ష‌లు….!

Satyam NEWS

అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది ధర్మపరిరక్షకుల కోరిక

Satyam NEWS

పేషంటును ఎలుక కరిచిన ఘటనపై విచారణ

Satyam NEWS

Leave a Comment