38.2 C
Hyderabad
April 29, 2024 21: 35 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని హతమార్చేందుకు మావోల ప్లాన్

#MuluguPolice

ప్రజా ప్రతినిధులను హతమార్చేందుకు మావోయిస్టుల వేసిన ప్లాన్ ను ములుగు పోలీసులు భగ్నం చేశారు. ములుగు మండలంలోని  మాన్సింగ్ తండ  గ్రామ పరిసరాల లోని  పోడు భూములలో  CPI మావోయిస్టులు మందుగుండు సామాగ్రి డంప్ ఉందని ములుగు ASPకి నమ్మదగిన సమాచారం వచ్చింది. సమాచారం మేరకు నేడు ములుగు SI పోలీసు సిబ్బంది,  BD టీం, ఇద్దరు VROలు, ఫోటోగ్రాఫర్  తో కలసి కూంబింగ్ మొదలు పెట్టారు. 

మాన్సింగ్ తండ పరిసర  ప్రాంతం  కు వెళ్లి పోడు భూములలో క్షుణంగా పరిశిలిస్తుండగా ఒక ప్రదేశం  లో అనుమానం వచ్చి తవ్వగా సుమారు 1 ½  మీటర్ల లోతులో ఒక స్టీలు బకెట్ ఉంది. అందులో ఒక  నల్లటి కవర్ ఉంది. వెంటనే BD టీం  సహాయం తో తగిన  జాగ్రత్తలు తీసుకొని పంచుల  సమక్షం లో  పరిశీలించగా ఆ నల్లటి కవర్ లో 312- తుపాకి తూటాలు , 2- Detonators , CPI మావోయిస్టు పార్టికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి.

CPI మావోయిస్టు  పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటి తమ ఉనికి చాటుకోవడానికి మళ్ళీ గ్రామాలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అయినట్లు అక్కడ లభించిన పత్రాలద్వారా పోలీసులు అంచనా వేశారు.

వీలైనంతమంది ప్రజా ప్రతినిధులను  అంతమోదించి  ప్రభుత్వాన్ని కులద్రోసి రాజ్యవ్యవస్తను అంతం చేసి  నూతన ప్రజాస్వామిక విప్లవ  వ్యవస్థను  తీసుకురావడానికి వారు కుట్ర  పన్నినట్లుగా పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చెన్నూరి రూపేష్  డి.ఎస్.పి k.దేవేందర్ రెడ్డి, ఎస్ బి  రెహమాన్, ములుగు ఎస్సై హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో పశుగ్రాస వారోత్సవాలు ఆరంభం

Satyam NEWS

ఏపీ ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ మాజీ ఎన్నికల అధికారి

Satyam NEWS

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

Satyam NEWS

Leave a Comment