40.2 C
Hyderabad
April 28, 2024 17: 01 PM
Slider మహబూబ్ నగర్

తెలంగాణలో పశుగ్రాస వారోత్సవాలు ఆరంభం

#Zoonosis Day

జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులు, జంతువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పై రైతులకు అవగాహన ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా పశువైద్య శాఖ అధికారి డా.అంజిలప్ప తెలిపారు. ప్రతి ఏటా జూలై 6వ తేదీన జరిగే ప్రపంచ  జూనోసిస్ డేను నేడు కొల్లాపూర్ వెటర్నరీ ఆసుపత్రిలో నిర్వహించారు.

జంతువుల నుండి మనుషులకు గాని మనుషుల నుండి జంతువులకి గాని వ్యాప్తిచెందే వివిధ రకాల రోగాలను జూనోటిక్ డిసీసెస్ అని అంటారు. ఇందులో బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ పారాసైటిక్ ఇతరత్రా రోగాలు ఉంటాయి.

ఈ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేదే ఈ జూనోసిస్ డే. ఈ సందర్భంగా నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర పశుగ్రాసం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా జెడి డాక్టర్.అంజిలప్ప తెలిపారు. మంగళవారం నుండి14 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాసం వారోత్సవాలు  ప్రారంభమవుతాయని తెలియచేశారు.

కొల్లాపూర్ మండలం లోని ప్రాంతీయ పశు వైద్యశాల లో బ్రిలియంట్ ఫార్మా ఖైరతాబాద్  వారి సహకారంతో డాక్టర్.అంజిలప్ప, కొల్లాపూర్  అసిస్టెంట్ డైరెక్టర్  డాక్టర్ ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేశారు. పెంపుడు జంతువుల యజమానులకు సూచనలు ఇచ్చారు.

వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. పశుగ్రాసం వారోత్సవాలలో రైతులు చురుకుగా పాల్గొనాలని డాక్టర్.అంజిలప్ప కోరారు.

సరైన మోతాదులో పశువులకు గ్రాసం, మందులు వాడటం వల్ల పాలు, మాంసం ఉత్పత్తి పెరుగుతుందన్నారు. రైతులకు  ప్రయోజనాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎడి ఆదిత్య వర్మా, డా.వరలక్ష్మి, డా.భాను కిరణ్, డా.అశ్విని, డా.యాదగిరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

గణనాథుని ఆశీస్సులతో శుభ ఫలితాలు జరగాలి

Satyam NEWS

మొహం చాటేసిన చంద్రబాబు వియ్యంకుడు

Satyam NEWS

అక్సిడెంట్:ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment