40.2 C
Hyderabad
April 28, 2024 17: 43 PM
Slider మహబూబ్ నగర్

గ్రీన్ ల్యాండ్ స్కూల్ విద్యార్థులకు గణిత ప్రతిభ బహుమతులు

maths exam

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఈనెల 21న నిర్వహించిన గణిత ప్రతిభ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొల్లాపూర్ అగ్రికల్చర్ అధికారి నాగరాజు బహుమతులను అందజేశారు. గత శనివారం భారతదేశ గణిత శాస్త్ర వ్యవస్థాపకులు శ్రీ రామానుజన్ 132 వ జయంతిని పురస్కరించుకొని గ్రీన్ ల్యాండ్ పాఠశాల యజమాన్యం మండల స్థాయి లో 5,6,7,8 తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నాలుగు పాఠశాల నుండి సుమారు 150 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రకటించారు. శ్రీ రామానుజ జయంతి ఆదివారం సెలవు కావడంతో సోమవారం గ్రీన్ ల్యాండ్ పాఠశాల యాజమాన్యం బహుమతులు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ అగ్రికల్చర్ అధికారి నాగరాజు హాజరైయారు.

విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రీ రామానుజం గొప్పదనాన్ని తెలుసుకోవాలన్నారు. ఈరోజు గణిత శాస్త్రం చదువుతున్న మంటే ఆయన ఫలితమేనాని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఈ.వెంకటేష్, ప్రిన్సిపాల్ డి.శంకర్, డి.కుమార స్వామి, కోన నరేష్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

కరోనా కాలాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలి

Satyam NEWS

ప్రాణం తీసిన ముగ్గు

Bhavani

కరోనాతో ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

Satyam NEWS

Leave a Comment