మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.యావల్ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్‌వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.వీరంతా తమ బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ప్రభాకర్ నారాయణ్ చౌదరి, ఆయన భార్యతో పాటు 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 10 సంవత్సరాల అమ్మాయి ఉంది.శవాలను పోస్టుమార్టం కు తరలించారు.