33.7 C
Hyderabad
April 27, 2024 23: 14 PM
Slider తెలంగాణ

పక్క రాష్ట్రాల వారు వచ్చి అమ్ముకోకుండా చూడండి

mini niranjan

గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొస్తే కచ్చితంగా కొనుగోలు చేస్తామని అన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. దేశం మొత్తం మీద ఒక్క తెలంగాణలోనే పండిన పంటలన్నీ మద్దతు ధరకు కొంటున్నామని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదని ఆయన అన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని పక్క రాష్ట్రంలో తక్కువ ధరకు పంటలు కొని తెలంగాణలో అమ్ముతున్నారని మంత్రి తెలిపారు. దీనిని అరికట్టేందుకు చెక్ పోస్ట్ లపై నిఘా ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. పండిన పంటలలో కేంద్రం 25 నుండి 30 శాతమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా 100 శాతం పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందని మంత్రి అన్నారు.

Related posts

నవయుగ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment