40.2 C
Hyderabad
April 28, 2024 15: 20 PM
Slider ప్రత్యేకం

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వద్దు : మంత్రి బొత్స

#botsa

ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తే తాను ఆ విషయంపై మాట్లాడనని, ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నదని చెప్పిన మాటల్ని వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులో, తెలుగుదేశం పార్టీ నాయకులో మారు పేరుతో ఫోన్ చేసి తన కాల్ ను రికార్డు చేసి తాను అనని మాటల్ని అన్నట్లు గా ప్రచారం చేయడం దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు జైల్ లో ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ విషయం న్యాయస్థానానికి చెప్పు కోవాలి కానీ తనకు ఫోన్ చేసి ఆ కాల్ ను రికార్డు చేసి ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్టు అని మంత్రి ప్రశ్నించారు.

తన టెలిఫోన్ సంభాషణ ఒక మీడియాలో చక్కెర్లు కొట్టడంతో…. దాని అసలు విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా మీడియా కు తెలిపారు. అదీ తన తమ్ముడు ఇంట్లో… ఆ విషయం మీడియా ముఖస్తంగా ఆ విధానం సరి కాదని స్పష్టం చేసారు. ఈ నెల 13వ తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం కు వచ్చారు. ఆ రోజు రాత్రే 09.30 కు ఓ పెద్దాయన ఫోన్ చేసి…” చంద్రబాబు పెద్దాయన అని ఆయనను అనవసరంగా జైల్లో పెట్టడం అన్యాయం” అని మొర పెట్టుకున్నారు. ఆయన అంశం కోర్ట్ పరిధిలో ఉందని మేము మాట్లాడ కూడదని మంత్రి బొత్స సున్నితంగా  ఓ మంత్రి గా…ఓ ప్రజాప్రతినిధిగా…బాధ్యతాయుతమైన నేతగా..సమాధానం ఇచ్చారు.

అయితే ఆ మర్నాడే…ఓ టీవీ లో పలువ చిలువగా రావడం తో…ఇదంతా ప్రతిపక్ష పార్టీ కుట్రేనని మంత్రి బొత్స సత్యనారాయణ… మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతానని, ప్రజా సమస్యలు తీర్చేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అయితే తాను ప్రజల కోసం చేస్తున్న ఈ పనిని దుర్వినియోగం చేయవద్దని ఆయన కోరారు. ఈ విధమైన జిమ్మిక్కులు చేయడం వల్ల నిజంగా అవసరం ఉండి ఫోన్ చేసేవారికి కూడా తాను సేవ చేసే అవకాశం పోతుందని ఆయన అన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్

Satyam NEWS

ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

అమెరికా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు

Satyam NEWS

Leave a Comment